నంద్యాల విజయంపై ఛాలెంజ్ చేసిన ఎస్పీవై రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికలో విజయంపై ఛాలెంజ్ చేశారు ఎంపీ ఎస్పీవై రెడ్డి… ఛాలెంజ్ చేస్తున్నా నంద్యాలలో గెలిచేవారే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడన్న ఎస్పీవై రెడ్డి… వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. నంద్యాల ఉపఎన్నికలో సైకిల్ దూసుకుపోతోందన్నారు ఎస్పీవై రెడ్డి.

వైఎస్ జగన్ వైఖరితోనే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు ఎస్పీవై రెడ్డి… రుణమాఫీ కింద రూ.లక్ష ప్రకటిద్దామని అప్పుడు నేను నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వైఎస్ జగన్ పట్టించుకోలేదన్నారాయన. శిల్పామోహన్ రెడ్డి… తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరకుంటే నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ జగన్ అభ్యర్థిని పెట్టేవాడా? అంటూ ఆయన ప్రశ్నించారు. నా కూతురికి సీటు ఇవ్వలేదని సీఎం చంద్రబాబుపై అలిగిన మాట వాస్తవమే నన్న ఎస్పీవై రెడ్డి… తప్పనిసరి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి మద్దతిచ్చానన్నారు.