విరిగిపడ్డ కొండచరియలు, ఏడుగురు మృతి…

హిమాచల్ ప్రదేశ్‌ మండిలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రెండు బస్సులు మూడు వాహనాలపై పడ్డాయి. దీంతో ఆ వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా… పలువురికి తీవ్ర గాయలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు రెస్క్యూ సిబ్బంది. శిథిలాల నుంచి ఏడు మృతదేహాల వెలికితీశారు… కొడచరియల కింద మరింత మంది చిక్కుకున్నట్టు సమాచారం.

మనాలి – పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో… ఆ రహదారిని మూసివేశారు పోలీసులు. ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకున్నారు. కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ… హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో గ‌త కొన్ని రోజులుగా కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని.. ఇది చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతి ని తెలియజేవారు ప్రధాని మోదీ. మరోవైపు శిథిలాకింద ఇంకా కొందరు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.