పల్లెకెలె టెస్ట్‌లో చెలరేగిన పాండ్యా…

భారత్‌ – శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరిదైన మూడో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. పల్లెకెలె టెస్ట్‌లో చెలరేగిన పాండ్యా… శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు… కేవలం 86 బంతుల్లోనే సెంచరీ చేశాడు పాండ్యా… టెస్ట్ కెరీర్‌లో పాండ్యాకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం… పాండ్యా ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు బాదాడు… రెండో రోజు లంచ్ స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 487 ప‌రుగులు చేయగా… లంచ్ సమయానికి పాండ్యా 108 పరుగులతో… ఉమేష్ యాద‌వ్ 3 పరుగులతో క్రీజులో ఉండగా… తర్వాత బ్యాటింగ్‌కు రాగానే వికెట్ క్పోయింది భారత్. దీంతో 487 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా.

భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ 119, పాండ్యా 108, కెఎల్ రాహుల్ 85, పుజారా 8, కోహ్లీ 42, రహానే 17, అశ్విన్ 31, సాహా 16, కుల్దీప్ యాదవ్ 26, షమీ ఆరు పరుగులు చేశారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్ట్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్… మూడో టెస్ట్‌లోనూ భారీ స్కోరే సాధించింది.