వారసత్వ పుజారులకు చెక్‌ పెట్టిన సరస్వతీ టెంపుల్ ఈవో

దక్షిణ భారతంలో ఉన్న ఏకైక సరస్వతీ ఆలయం బాసరలో ఉత్సవ విగ్రహం మాయం వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ప్రధానార్చకుడే తీసుకెళ్లాడని సిబ్బంది, బీరువాలోనే ఉందని అర్చకుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అటు ఈవో మాత్రం ప్రధానార్చకుడికి నోటీసులు పంపి చేతులు దులుపుకున్నారు. ఉత్సవ విగ్రహం ఎక్కడుందో కనిపెట్టే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదు.

బాసర అమ్మవారి ఆలయానికి ఓ పవిత్రత ఉంది. పూజలు ఎలా చేయాలో కొన్ని నియమాలున్నాయి. విగ్రహాలను ఆలయంలో ఓచోట నుంచి మరోచోటికి తరలించాలంటేనే.. కొన్ని శాస్త్రోక్తమైన పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండానే ఉత్సవ విగ్రహాన్ని ప్రధానార్చకుడు ఏకంగా ఊరు దాటించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విగ్రహం మాయం తరువాత దిద్దుబాటు చర్యలు చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా వారసత్వ పుజారులకు చెక్‌ పెట్టారు ఈవో. ఆ మేరకు అందరికీ విధుల పత్రాలను విడుదల చేశారు.