చివరి పరుగులో కుప్పకూలిన బోల్ట్…

పరుగు పందెం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌దే… ఈ పరుగుల వీరుడి దాహానికి ఎన్నో పతకాలు ఫిదా అయ్యాయి… ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టాయి… అయితే తన అంతర్జాతీయ కెరీర్‌ను బంగారు పతకంతో ముగించాలని భావించిన ఉసేన్ బోల్ట్ ఆశలు అడియాశలయ్యాయి… చివరి పరుగు పందెంలో పతకం లేకుండానే అంతర్జాతీయ కెరీర్‌ ముగించిన తన అభిమానులను నిరాశపరిచాడు బోల్ట్.

శనివారం రాత్రి జరిగిన 4×100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు ఉసేన్ బోల్ట్… టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్ బెల్, బోల్ట్ తో కూడిన జమైకా బృందం ఈ ఫైనల్లో పాల్గొనగా.. కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే బోల్ట్ తొడ కండరాలు పట్టేయడం… మోకాలి నొప్పితో ట్రాక్ పైనే కుప్పకూలిపోయాడు. దీంతో చివరి పరుగు పందెంలో పతాకం లేకుండానే బోల్ట్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు.