పోలవరాన్ని అడ్డుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం…

పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో లేఖ రాశారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు… గతంలో చంద్రబాబు పోలవరాన్ని తుంగలో తొక్కారని ఆరోపించిన ఆయన… ఇప్పుడు చంద్రబాబు పోలవరంపై మొసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై గతంలో చంద్రబాబుకు రెండు లేఖలు రాశానన్న కేవీపీ… నా లేఖలపై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.

పైగా పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… పోలవరం ప్రాజెక్టును నేను అడ్డుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. 2019 నాటికి చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తే నా శేష జీవితాన్ని ఆయనకు భారతరత్న సాధించడానికి కృషి చేస్తానని అన్నారు కేవీపీ. 2004లో పోలవరాన్ని చంద్రబాబు అడ్డుకున్నట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు కేవీపీ… ప్రెస్ మీట్‌లో తన లేఖను చదివి వినిపించిన కేవీపీ… ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి…

https://www.youtube.com/watch?v=R-Ag_Ql5noM