స్కైలో మెగా నిర్మాత?

దేశ‌ముదురు, వ‌రుడు, జులాయి, కెమెరామేన్ గంగ‌తో రాంబాబు, నాయ‌క్, బ్రూస్‌లీ .. ఇలా మెగా సినిమాల‌తో మెగా నిర్మాత‌గా పాపుల‌ర‌య్యారు డి.వి.వి దాన‌య్య‌. వీటిలో కొన్నిటికి దాన‌య్య డైరెక్టు నిర్మాత‌. మ‌రికొన్నిటిని ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించారు. వ‌ర‌స మెగా సినిమాల‌తో మెగా నిర్మాత‌గా పాపుల‌ర‌య్యారు. అయితే దాన‌య్య కెరీర్‌లోనే ది బెస్ట్ ఇయ‌ర్‌గా 2017 నిలుస్తుంద‌ని ట్రేడ్ లో మాటా మంతీ సాగుతోంది.

నాని హీరోగా దాన‌య్య నిర్మించిన `నిన్ను కోరి` అంచ‌నాల్ని మించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు సాధించింది. ఈ విజ‌యం దాన‌య్య‌కు చాలా స్పెష‌ల్. ఈ స‌క్సెస్ మ‌రిన్ని క్రేజీ సినిమాలు నిర్మించే ఉత్సాహాన్నిచ్చింద‌ని చెబుతున్నారు. ఇక ఇదే హుషారులో ప్ర‌స్తుతం మ‌హేష్‌తో `భ‌ర‌త్ అను నేను` చిత్రం నిర్మిస్తున్నారు. త‌దుప‌రి రాజ‌మౌళితో సినిమా ఉంటుంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే రాజమౌళి వైపు నుంచి ఓ క్లారిటీ వ‌చ్చింది. అయితే దాన‌య్య‌కు మ‌హేష్‌, బ‌న్ని, ఎన్టీఆర్ ల నుంచి ఒత్తిడి ఉంద‌ని తెలుస్తోంది. బాహుబ‌లి సిరీస్‌తో సంచ‌ల‌నం సృష్టించిన‌ రాజ‌మౌళితో ప‌ని చేసేందుకు ఈ హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మేర‌కు దాన‌య్య రిక‌మండేష‌న్ ట్రై చేస్తున్నారుట‌. మొత్తానికి మెగా నిర్మాత‌ దాన‌య్య సీన్‌ స్కైలో ఉంద‌న్న‌ది ట్రేడ్‌లో చెబుతున్న మాట‌!