గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల రిహార్సల్స్…

పంద్రాగస్టు వేడుకల కోసం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు, విద్యార్థులు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు… డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 15 వేడుకలకు 5 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు డీసీపీ వెంకటేశ్వరరావు.

పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాలతో పహారా ఉంటుందని తెలిపారు డీసీపీ వెంకటేశ్వరరావు… వారం ముందే గోల్కొండ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సీఎం వేదిక దగ్గరకు చేరుకుంటారని తెలిపారు. గోల్కొండ కోటలో కలర్ ఫుల్‌గా సాగిన పంద్రాగస్టు వేడుకులను… ఇతర ఏర్పాట్లను చూసేందుకు పై వీడియోను క్లిక్ చేయండి…