డబ్బు పంచినట్టు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటాం…

నంద్యాల ఉప ఎన్నికలో తాము డబ్బులు పంచినట్టు నిరూపిస్తే ఇప్పటికిప్పుడే… మా నాన్న ను ఎన్నికల నుంచి విత్ డ్రా చేయిస్తానంటూ సవాల్ విసిరారు శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి… శిల్పా సేవా సమితి పేరుతో మేం ఓట్లు కొనుగోలు చేస్తున్నామన్న టీడీపీ నేతల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన మండిపడ్డారు. నిన్న మా కుటుంబ సభ్యులు ప్రచారంలో భాగంగా బొట్టు బిల్లలు పెట్టి ఓటు అడుగుతుంటే… డబ్బులు పంచినట్టు టీడీపీ ఆరోపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే మేం డబ్బులు పంచినట్టు నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి… మా ఇంటి చుట్టూ పోలీసులను… నిఘా పెట్టి డబ్బులను ‌పంచుతున్నామని ఆరోపించడం అన్యాయమన్నారు. ఇప్పటికీ చెబుతున్నా… భూమా నాగిరెడ్డి గతంలో సాధించిన విజయం కేవలం శోభానాగిరెడ్డి మృతితోనే… ఈ సారి మా నాన్న గెలుపు ఖాయమన్నారు రవిచంద్ర… ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి… https://www.youtube.com/watch?v=c1TOiFVebOQ