రేపు సీఎంను కలవనున్న కాపు నేతలు…

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ కాపు ప్రజాప్రతినిధులు సోమవారం సమావేశం కానున్నారు. మంజునాథ కమిషన్ నివేదికను వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని చంద్రబాబును కాపు నేతలను కోరబోతున్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో కాపు ప్రజాప్రతినిధులు చంద్రబాబును కలుస్తున్నారు.

కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపు నేతలు సీఎం చంద్రబాబును కోరనున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పాదయాత్రకు ప్రయత్నించడం… ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే… రోజుకోసారి ఆయన పాదయాత్రకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో మళ్లీ వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. తన జాతికి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగబోదని ప్రకటించారు ముద్రగడ.