చంద్రబాబువి అవే మోసాలు… ఆవే మాటలు…

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కొనసాగుతోంది… పదునైన వ్యాఖ్యలతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగన్… ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు… ఈ మూడున్నరేళ్ల కాలంలో ఒక్క ఇల్లు అయినా కట్టాడా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఎన్నికల్లో వాడుకున్నాడు తప్ప… ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయలేదన్నారు జగన్.

ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు జగన్… ఎన్నికలు వచ్చాయంటే మోసపూరిత మాటలతో ప్రజలను మభ్య పెడతారని… తర్వాత కనిపించరన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నో చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ జగన్ ప్రశ్నించారు… ఎన్నికలు వస్తే అరిగిపోయిన టేప్ రికార్డు మాదిరిగా మళ్లీ ఆవే మోసపూరిత మాటలు మాట్లాడుతారంటూ మండిపడ్డారు జగన్… నంద్యాల రోడ్‌షోలో జగన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…