క్రికెట్ స్టేడియం దగ్గర ఆత్మాహుతి దాడి, 9 మంది మృతి…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు… రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసే ఉగ్రవాదులు… ఈ సారి టీ-20 మ్యాచ్ జరుగుతున్న క్రికెట్ స్టేడియాన్ని టార్గెట్ చేశారు… కాబుల్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు… స్టేడియం బయట భద్రతా తనిఖీలు చేసే కేంద్రం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంతి మృతిచెందగా… పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.

క్రికెటర్లంతా క్షేమంగానే ఉన్నారు. హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు… క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే మ్యాచ్ నిలిపివేసిన అధికారులు… కాసేపటి తర్వాత తిరిగి మ్యాచ్‌ను కొనసాగించారు. సోమవారం ప్రారంభమైన టీ 20 మ్యాచ్‌లు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.