స్టార్ హీరో ఫ్యాన్స్ సారీ చెప్పాల్సొచ్చిందే!

నీట్ ప‌రీక్షలో ఆశించిన ర్యాంక్ సాధించ‌లేని కార‌ణంగా త‌మిళ‌నాడు విద్యార్థిని అనిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై స్టార్ హీరో సూర్య త‌న అభిప్రాయాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడారు. అయితే సూర్య మాట తీరు రుచించ‌లేదంటూ త‌మిళ‌నాడు భాజ‌పా అధ్య‌క్ష‌రాలు డా.త‌మిజిసాయి సౌంద‌ర‌రాజ‌న్ సీరియ‌స్ అయ్యారు. విద్యా వ్య‌వ‌స్థ గురించి సూర్య‌కి ఏమీ తెలియ‌దు .. డాక్ట‌ర్ కాబోయే వాళ్ల‌కు నీట్ చాలా ముఖ్యం! సూర్య కోట్ల‌లో సంపాదించినా `నీట్‌` కోసం చేసిందేం లేదంటూ సౌంద‌ర రాజ‌న్ వ్యాఖ్యానించారు.

దీంతో సామాజిక మాధ్య‌మాల్లో సూర్య అభిమానులు స‌ద‌రు మ‌హిళా నేత‌ను ఓ రేంజులో ఆడేసుకున్నారు. కొంద‌రు తీవ్రంగా బూతు ప‌దాల‌తో తిట్టేశారు. అయితే అలా మాట్లాడ‌వ‌ద్ద‌ని సూర్య అభిమానుల్ని వారించే ప‌ని పెట్టుకోవాల్సొచ్చింది. అభిమానుల త‌ర‌పున సూర్య అభిమాన సంఘం అధికారికంగా త‌మిజ సాయి సౌంద‌ర‌రాజ‌న్‌కి క్ష‌మాప‌ణ‌లు కోరుకుంది. అలాగే సూర్య అభిమాన సంఘం ప్ర‌తినిధులు మాట్లాడుతూ -“సూర్య‌కు చెందిన అగ‌ర‌మ్ ఫౌండేష‌న్ వేలాది మంది విద్యార్థుల‌కు ఉచిత విద్య‌ను అందిస్తోంది“ అని పేర్కొన్నారు.