చై-మారుతి టైటిల్ ఇదే…

మొన్న నానితో `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`, విక్ట‌రీ వెంక‌టేష్ తో `బాబు బంగారం`… నిన్న శ‌ర్వానంద్ తో `మ‌హానుభావుడు`…మ‌రి నేడు నాగ చైత‌న్య‌తో డైరెక్ట‌ర్ మారుతి టైటిల్ ఏంటి? ప‌్ర‌స్తుతం ఈ టైటిల్ విష‌య‌మై అక్కినేని అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబినేష‌న్ లో సినిమా ప్రారంభోత్స‌వానికి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌వేళ‌… తాజాగా ఆ టైటిల్ కూడా లీకైంది. చైతూ క్యారెక్ట‌ర్ ను బేస్ చేసుకుని `మంచోడు` అనే టైటిల్ ను మారుతి ఫిక్స్ చేశాడుట‌. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మారుతి సినిమా టైటిల్స్ అన్నీ క్యాచీగా, సింపుల్ గానే ఉంటాయి. క‌థ రాసుకునే ముందే ఆయ‌న టైటిల్ ను ఫిక్స్ చేసుకుంటాడు. టైటిల్ ను బ‌ట్టే క‌థ‌ను కంప్లీట్ చేస్తాడు. ప్ర‌స్తుతం మంచోడు కు అదే ఫార్ములాను అప్లై చేస్తున్న‌ట్టే అనిపిస్తోంది. మంచోడు లాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టినా… క‌థ‌లో లాజిక్‌ని మారుతి వ‌ర్క‌వుట్ చేయ‌గ‌ల‌డ‌న్న ధీమా మేక‌ర్స్‌లో ఉంది.