గవర్నర్ ను కలిసిన మంత్రి పరిటాల సునీత

తన కుమారుడు శ్రీరామ్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ మంత్రి పరిటాల సునీత ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన పరిటాల సునీత… గవర్నర్‌కు శుభలేఖ అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి శుభలేఖ ఇచ్చినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిటాల రవికి అభిమానులు ఉన్నారని, పరిటాల కుటుంబంతో అనుబంధం ఉన్న అందరినీ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.