నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఓ అడుగు ముందుకు పడింది… శాశ్వత భవనాల నిర్మాణాలకు తుదిరూపు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది… ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వత భవనాల డిజైన్లపై కీలక సమీక్ష నిర్వహించారు. పాలనకు కీలకమైన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల భవనాల డిజైన్లను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు చూపించారు.

వజ్రాకృతి అసెంబ్లీ… స్తూపాకారంలో హైకోర్టు డిజైన్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలోనే వీటికి ఆమోద ముద్ర తెలిపారు. వాటికి సంబంధించి బ్లూ ప్రింట్లను సైతం సిద్ధం చేశారు ఆఫీస్ కాంట్రాక్టర్స్… అయితే ఈ తుది డిజైన్లు, బ్లూ ప్రింట్లకు చంద్రబాబు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.