త్వరలో విచారణకు డేరా ఉన్నతాధికారి

అత్యాచార కేసులో గుర్మీత్‌ సింగ్‌ దోషిగా ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అక్కడ చెలరేగిన హింసాకాండకు సంబంధించి డేరా సచ్చా సౌధా చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు విచారించనున్నారు. అయితే డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తర్వాత వారసురాలిగా విపాసన ఇన్సాన్‌ను ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. కాగా విపాసనను కూడా తాము త్వరలో విచారించనున్నట్లు సిర్సా పోలీసులు వారికి తెలిపే అవకాశం ఉందని హర్యానా డీజీపీ బీఎస్‌ సంధూ వెల్లడించారు. అంతేకాకుండా డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన వెల్లడించారు.

డేరా వ్యవహారాల్లో కీలక వ్యక్తి ఆదిత్య ఇన్సాన్‌ కూడా ప్రస్తుతం దేశంలోనే ఉన్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వీరిని పట్టుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లకు పోలీస్‌ బృందాలను పంపామన్నారు. అంతేకాకుండా వీరంతా దేశం విడిచి పారిపోకుండా లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు.