చాందినీ హత్యకేసులో అసలు నిజాలు…!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన చాందినీ జైన్ హత్య కేసులో అసలు నిజాలను బయటపెట్టారు పోలీసులు… మదీనాగూడలో అదృశ్యమైన ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు… ఆమె స్కూల్‌మేట్, డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య మీడియాకు తెలియజేశారు… చాందిని జైన్‌పై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవన్న సీపీ… ప్రస్తుతానికి హత్యకేసుగానే పరిగణిస్తున్నామని… ఫోరెన్సిక్ నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయన్నారు… ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…