రెండు సినిమాలు తీసినంత ఫీలయ్యా

ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించడం చాలా కష్టమని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ అన్నారు. ఆయన దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్‌ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో దీన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా మహేశ్‌ నటించిన తొలి తమిళ చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జె. సూర్య విలన్ పాత్ర పోషించారు. సెప్టెంబరు 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో కొన్ని విశేషాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ మురగదాస్.

మురగదాస్ మాట్లాడుతూ… తాను రీమేక్‌లు తీశా. బహు భాషల్లో చిత్రాలు చేసినా.. ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించడం చాలా కష్టంమని ఆయన అన్నారు. ‘స్పైడర్‌’ షూట్‌లో ఒకే సమయంలో రెండు సినిమాల్ని తీసినంత కష్టపడాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఓ సన్నివేశాన్ని చాలా టేక్‌ల ఇప్పుడు తెలుగు వెర్షన్‌ను తీయాలి అని గుర్తొస్తుంది. ఇది మానసికంగా, శారీరికంగా ఇబ్బందిగా ఉంటుంది అని ఆయన మీడియాతో పంచుకున్నారు. మహేశ్ తమిళ కుర్రాడిలా ఆయన మాట ఉంటుందని ఇది తమిళులను బాగా ఆకర్షిస్తుందని ఆయన అన్నారు.