తెలంగాణ గాంధీ అంటూ కేసీఆర్ కు ప్రశంసలు

తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అనుమతి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని చెప్పకనే చెప్పారు. దీంతో ప్రతి ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని అయన ఆదేశించారు. ఈ విషయంలో కేసీఆర్ మన తెలంగాణ గాంధీ అంటూ మంచు మనోజ్ అభివర్ణించారు.

‘మన తెలుగు భాషను పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టు గా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు మనోజ్. కాగా ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం హర్షణీయం అంటూ అంతటా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.