దీంతో అసెంబ్లీ స్థానాల పెంపులేదని తేలిపోయింది…

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు… 175  సీట్లు గెలుస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పినదాన్ని బట్టి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపులేదని తేలిపోయిందన్నారు. 175 స్థానాల్లో మిత్రపక్షంతో కలిశా… లేక తెలుగుదేశం పార్టీ సొంతంగానా అన్న దానిపై లోకేష్ స్పష్టత ఇవ్వాలన్నారాయన. బీజేపీ కూడా అన్ని స్థానాల్లో బలపడాలని కోరుకుంటుందన్నారు విష్ణుకుమార్ రాజు. 2019 ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారాయన.