చాందిని హత్యను ఛేదించిన పోలీసులు…

ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఆమె స్కూల్‌మేట్, డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి చాందినిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేస్తుండటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. అయితే స్నేహితులతో పార్టీ ఉందని, ఈ నెల 9న ఇంటి నుండి బయటికి వెళ్లిన చాందిని ఆ తరువాత ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసిన పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ గుట్టల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.