హాట్ స్టోరి: బిగ్‌బి-రిషీజీ `102 నాటౌట్‌`

102 వ‌య‌సు తండ్రి- 72 ఏళ్ల కొడుకు మధ్య సాగే ఆస‌క్తిక‌ర డ్రామాతో ఉమేష్ శుక్లా తెర‌కెక్కిస్తున్న చిత్రం `102 నాటౌట్‌`. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, రిషీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తండ్రిగా అమితాబ్‌, కొడుకుగా రిషీజీ న‌టించ‌నున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సెట్స్‌కెళ్లేందుకు ప్రిపరేష‌న్స్ సాగుతున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే ఇండియ‌న్ సినిమా 100 ఏళ్ల హిస్ట‌రీలో మెజారిటీ పార్ట్ జీవితాన్ని సినిమాతోనే గ‌డిపేసిన‌ ఈ ఇద్ద‌రూ స‌మ‌కాలికులుగా ఎన్నో చిత్రాల్లో న‌టించారు. క‌లిసి న‌టించిన సినిమాలు ఉన్నాయి. అయితే మ‌ధ్య‌లో గ్యాప్ వ‌చ్చింది. 26 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమా కోసం క‌లిసి న‌టిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ పాట కోసం ఆ ఇద్ద‌రూ గాత్రం స‌రి చేసుకుంటున్నారు. యాథృచ్ఛిక‌మే అయినా ఇది ఇంట్రెస్టింగ్‌. గుజ‌రాతీ డ్రామా `సౌమ్య జోషి` ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. స్వ‌త‌హాగా గుజ‌రాతీ అయిన ఉమేష్ శుక్లా ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ల కోసం అదిరిపోయే పాత్ర‌ల్ని క్రియేట్ చేశారుట‌. ఇన్నేళ్ల కెరీర్‌లో బిగ్‌బి, రిషీజీ ఇద్ద‌రికీ గుజ‌రాతీ పాత్ర‌ల్లో న‌టించ‌డం కొత్తేన‌న్న‌ది మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. ప్ర‌ఖ్యాత టి.సిరీస్ సంస్థ‌ ఈ క్రేజీ మూవీని నిర్మిస్తోంది. ఇటీవ‌లే పాట‌ల రికార్డింగ్ ప్రారంభించారు.