గోవా సీఎంతో చంద్రబాబు భేటీ…

గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్… గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌తో అమరావతిలో సమావేశమైన లోకేష్… గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక నిర్ణయాల గురించి వివరించారు. త్వరలో గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ప్రతీ ఇంటికీ ఆర్‌ఎఫ్‌ఐడీ పేరుతో కార్డులు ఇస్తున్నామని తెలిపారు. మంత్రి లోకేష్‌తో భేటీ అనంతరం… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు మనోహర్ పారికర్… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు… పారికర్‌కు వివరించారు. త్వరలోనే ఏపీలోని గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకుంటానన్నారు మనోహర్ పారికర్.