రాయలసీమ జలసీమ అయ్యింది…

పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 884.8 అడుగుల మట్టానికి నీరు చేరుకుంది… ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. రెండు గేట్ల ద్వారా 28 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు వదులుతున్నారు… మరోవైపు విద్యుత్ ఉప్పత్తి ద్వారా సాగర్‌కు 88 వేల క్యూసుక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.

కృష్ణమ్మ తల్లి ఇలా వచ్చి తమను కాపాడుతుందని ఎవరూ ఊహించలేదు… సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో జలసిరికి హారతి కార్యక్రమంలో కోట్లాది మంది కదిలారు… అందరి ఆశలు ఫలించి ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నిండిందన్నారు దేవినేని ఉమ… నీటి విడుదలలో సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలకు ఆధారంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో అన్ని జిల్లాలు తడిసి ముద్దాయాయని… ప్రత్యేకంగా రాయలసీమ… రత్నాల సీమ… జలసీమ అయ్యిందన్నారు… ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవినేని ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…