లిక్కర్ మాఫియా చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ…!

రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మాఫియా చేతిలో కీలు బొమ్మలా మారిందని మండిపడ్డారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి… ప్రభుత్వం యథేచ్ఛగా వైన్ షాపులు, బార్లు ఓపెన్ చేస్తుందని… నేషనల్ హైవేలపై వద్దంటే… జాతీయ రహదారులను డినోటిఫై చేశారన్నారు. సుప్రీం కోర్టు తీర్పును కాలరాసి మరి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని… లిక్కర్ మాఫియాతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారాయన. ఏజెన్సీ ప్రాంతాల్లో తాండాలకు ఇంకా రోడ్లు లేవు కానీ, మద్యం దుకాణాలు ఎలా పెడతారు అంటూ ఆయన ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల విషయంలో సర్కార్ పునరాలోచించాలన్నారు కిషన్ రెడ్డి.

రాత్రిపూట వైన్ షాపులు మూసినా పర్మిట్‌రూమ్‌లు మాత్రం మూయటం లేదన్నారు కిషన్ రెడ్డి… గోల్డెన్ హవర్, హ్యాపీ హవర్ పేరుతో డిస్కౌంట్లు ఇస్తున్నారని… ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నా సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలు పతనం అవుతున్నాయి, చిన్న వయసులో ఎందరో భర్తలను కోల్పోయి వితంతువులు అవుతున్నారు… మద్యం హత్యలన్నింటకీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కిషన్ రెడ్డి.