ఆ గుహలోకి హనీప్రీత్, డేరాబాబాకే అనుమతి..!

డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తుంది. గతవారం అరెస్టయిన హనీప్రీత్ ను హర్యాణాకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. సిర్సా పట్టణంలో డేరా బాబా ఆశ్రమంలో గుర్మీత్‌కి చెందిన ఓ గుహ ఉంది. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆ గుహలోకి గుర్మీత్, హనీప్రీత్ కి తప్పా మరెవ్వరికీ అనుమతి లేదని హనీ వెల్లడించినట్లు సమాచారం అందుతుంది.

అయితే ఆ గుహ తలుపులు తన వేలిముద్రలతోనే తెరుచుకుంటాయని సిట్ విచారణలో హనీప్రీత్ బయటపెట్టినట్లు తెలుస్తుంది. గుర్మీత్ అరెస్టయ్యాక పంచకులలో అల్లర్లకు పాల్పడేలా చేసింది తానేనని, ఇందుకోసం, కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశానని చెప్పింది హనీ. కాగా హనీప్రీత్ విచారణలో బయటపెట్టిన విషయాలను ల్యాప్ టాప్ లో భద్రపరుస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.