హైదరాబాదీలకు తప్పని కష్టాలు!

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది… 10 రోజులుగా కుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి… ఇప్పుడు మళ్లీ వర్షం పడడంతో పరిస్థితి మొదటికివచ్చింది. మాదాపూర్, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. 2 గంటలకు పైగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి… దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది… వర్షంపడిన ప్రాంతాలు… ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితిపై పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి…