దీపావళి సందర్భంగా జియో అదిరిపోయే ఆఫర్…

టెలికం రంగంలో రిలయన్స్ జియో అడుగు పెట్టడమే ఓ సంచలనం… దాంతో ప్రత్యర్థులకు సవాల్ విసిరి… అంతా టారీప్‌లు తగ్గించేలా చేయడం జియోకే చెల్లింది… అంతటితో ఆగని జియో ఏదో ఒక్క కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది… తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని ‘దీపావళి ధన్‌ ధనా ధన్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది జియో.

జియో యూజర్లు రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది…. ఈ రోజు ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈ నెల 18 వరకు అందుబాటులో ఉండనుండగా… క్యాష్‌బ్యాక్‌ వోచర్ల రూపంలో అందిస్తున్నారు… వీటిని మళ్లీ రీచార్జ్‌ చేసుకునేందుకు వీలు కల్పింస్తోంది. ఇప్పటికే రూ.399తో 84 రోజుల పాటు 84జీబీ డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తున్న జియో… దీపావళి ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌లో ఈ నెల 18లోపు రూ.399తో రీచార్జ్‌ చేసుకునే యూజర్లకు రూ.50 విలువ గల 8 వోచర్లు అందించనుంది… వీటి విలువ మొత్తం రూ.400… వీటిని మళ్లీ రీచార్జ్‌ చేసుకోవచ్చు… ఈ కూపన్లను ఇతర జియో వినియోగదారుకు బహుమతిగా ఇచ్చినా వారు ఉపయోగించుకునే వీలుంటుంది… నవంబర్‌ 15వ తేదీ తర్వాత మాత్రమే ఓ వోచర్లను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.