విశాఖ మన్యంలో మావోయిస్టుల విధ్వంసం…

విశాఖపట్నం మన్యంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు… దారకొండలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను పేల్చేశారు… నిన్న రాత్రి సమయంలో కొత్తగూడవీధి మండలం దారకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో ఉన్న ఈ టవర్ దగ్గరకు సుమారు 50 మంది మావోయిస్టులు… సానుభూతిపరులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ముందుగా స్వాధీనం చేసుకుని… అనంతరం శక్తివంతమైన మందుపాతరతో టవర్‌ను పేల్చేశారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా దారకొండ ఉలిక్కిపడింది… చాలా రోజుల క్రితమే ఈ సెల్ టవర్ నిర్మించినా… సాంకేతిక కారణాలతో ప్రారంభించడానికి జాప్యం జరిగింది… ఐదు నెలల క్రితమే దీనిని ప్రారంభించారు. మావోయిస్టులే సెల్ టవర్ పేల్చేసినట్టు గూడెం సీఐ నారాయణరావు తెలిపారు.