ఇమ్రాన్‌ఖాన్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్…

పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పాక్ ఎన్నికల సంఘం… కోర్టు ధిక్కరణ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసులో ఇమ్రాన్ వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం… తాను కోర్టుకు రాలేకపోతున్నానని రాతపూర్వకంగా నైనా ఇప్పటి వరకు కోర్టుకు ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్‌కు ఎన్నికల కమిషన్ ప్రతినిధి హారూన్ షిన్వారీ తన న్యాయమూర్తుల బృందం వారెంట్ జారీ చేసింది.

ఈనెల 26వ తేదీన జరిగే విచారణకు ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు పట్టుకుని రావాలని ఆదేశించింది. అరెస్టు వారెంట్లు జారీచేయడానికి రాజ్యాంగబద్ధమైన హక్కును కమిషన్‌కు ఉందని హారూన్ షిన్వారీ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఇమ్రాన్ ఆరోపించారు… ఆ కేసులో విచారణ కొనసాగుతుండగా… ఆయన కోర్టుకు రావడంలేదని ఈసీ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది… అయితే గత నెలలో ఇదే విధమైన వారెంట్ జారీ చేసింది… కానీ, ఇస్లామాబాద్ హై కోర్టు దానిని తిరస్కరించింది. దీనిపై హైకోర్టులో అప్పీల్‌ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది బాబర్ తెలిపారు.