మళ్లీ జైలుకు వెళ్లిన ‘చిన్నమ్మ’…

భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఐదు రోజుల పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ, తిరిగి జైలుకు బయల్దేరింది. గురువారంలో ఆమె గడువు ముగియగా, ఈ రోజు బెంగళూరుకు బయలుదేరనున్నారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కాగా ఇటీవల ఆమె భర్త నటరాజన్‌ ఆరోగ్యం క్షీణించడంతో అతడిని చూసేందుకు అనుమతినివ్వాలంటూ శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిశీలించిన జైళ్ల శాఖ గత శుక్రవారం ఐదు రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. ఇందులో కొన్ని షరతులు విధించింది. పెరోల్‌పై విడుదలవుతున్నా ఆమె, తన బంధువుల నివాసంలో మాత్రమే ఉండాలని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, మీడియా ప్రకటనలు చేయరాదని నిబంధనలు విధించింది.