కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేస్తా..!

లక్షమంది ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో పలు కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.

సూర్యాపేట జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ప్రగతి సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ ఏలేశ్వరం వద్ద నిర్మించాలని ముందుగా నిర్ణయించారని.. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మోసం వల్లే స్థలం మారిందని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టు అసలు పేరు నందికొండ అని.. తర్వాత దాన్ని నాగార్జునసాగర్‌గా మార్చారని తెలిపారు. ఇంకా సూర్యాపేటకు కేసీఆర్‌ వరాలుజల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్‌లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలను మంజూరు చేస్తామన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15లక్షలు, తండాకు రూ.10లక్షలు కేటాయిస్తామని తెలిపారు. సూర్యాపేటలో బంజారా భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.