జిల్లాల విభజనకు ఓ ప్రాతిపదికే లేదు…

తెలంగాణలో జిల్లా విభజనకు ఓ ప్రాతిపదికే లేదన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… ఓ పద్ధతి లేకుండా జిల్లాల విభజన చేయడం కారణంగా… పాలనా సౌలభ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. 5 లక్షల జనాభాకు ఓ జిల్లా… 50 లక్షల జనాభాకు మరో జిల్లా ఉంటే… అది పరిపాలనా సంస్కరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి…

31 జిల్లా విభజనను ఏ లెక్కన చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి… జనాభా ప్రాతిపదికనా? ఆదాయం ఏమైనా ప్రాతిపదికనా…? వైశ్యాల్యం ఏమైనా ప్రాతిపదికనా?… ఈ ప్రశ్నలు అధికారపక్షాన్ని అడిగితే వారి దగ్గర సమాధానం లేదని… ఆంధ్రలో 13 జిల్లాలున్నాయి కాబట్టి మేం ఉల్టా చేసి 31 జిల్లాలు చేశామని చెప్పారంటూ సెటైర్లు వేశారు రేవంత్… టీడీపీలో సామాన్య కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ కి వ్యతిరేకంగా విపక్షలు ఏకంకావాల్సి ఉందని పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ అంటే గొర్లు, బర్లు, చేపలు, చీరలు పంపిణీ కాదని… గతంలో ప్రతిపక్షాలను కలుపుకుపోయి ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర టీడీపీకి ఉందన్నారాయన. ప్రతిపక్షాల అనైక్యతే కేసీఆర్ బలం అని వ్యాఖ్యానించిన రేవంత్… రెండు నెలల క్రితం 100 సీట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్.. నిన్న 50 సీట్లు వస్తాయని చెబుతున్నారన్నారు.