యునెస్కో నుండి వైదొలిగిన అమెరికా.!

అమెరికా మ‌రో సంచ‌ల‌నాత్మక నిర్ణయం తీసుకుంది. యూనైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైన్ టిఫిక్ అండ్ క‌ల్చర‌ల్ ఆర్గనైజేష‌న్ (యునెస్కో) నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకట‌న చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ‘పారిస్‌ ఒప్పందం’ నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచ‌ల‌న ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. కాగా అస్సలు ఎవ్వరూ ఊహించ‌ని నిర్ణయాలు తీసుకుంటూ ట్రంప్ త‌న‌దైన శైలిలో ముందుకెళ్తున్నారు.

యునెస్కో యాంటీ ఇజ్రాయెల్‌ విధానాన్ని అవలంభిస్తుందని అమెరికా చాలా కాలం నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై యూనెస్కో తమ పాలసీకి సానుకూలంగా లేని కార‌ణంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అంశంపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి అమల్లోకి వస్తుందని అమెరికా వెల్లడించింది.