పాదయాత్రలో టీడీపీ బండారం బయట పెడతాం…

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో టీడీపీ బండారం బయట పెడతామన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు… నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఏపీకి పాదయాత్రలు కొత్తకాదు కొత్తకాదు… జగన్, చంద్రబాబు యాత్రలు చేశారు… అయితే జగన్ పాదయాత్ర చేయడానికి అనర్హులంటూ మంత్రులు మాట్లాడం… ప్రత్యేక హోదా కోరే అర్హత కూడా జగన్ కి లేదని దాడి చేయడం చూస్తుంటే… జగన్ పాదయాత్ర చేస్తే… తమ బండారం బయటపడుతుంది… టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు అంబటి.

జగన్‌పై ఉన్న కేసులు టీడీపీ, కాంగ్రెస్ కలిసి పెట్టిన రాజకీయ కక్ష పూరిత కేసులు కావా అంటూ ప్రశ్నించారు అంబటి… శుక్రవారం కోర్టు హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరతామన్నారు. వైసీపీ యువభేరి చూసి టీడీపీ నేతలు ఒత్తిడికి లోనవుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని… రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలన గురించి ప్రజలకు చెప్పడానికే జగన్ పాదయాత్ర అన్నారు అంబటి రాంబాబు.