బాక్సాఫీస్ వద్ద నయన్ హవా!

నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో ‘అరాం’ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని ఏరియాల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇదొకటని, బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. సామాజిక సమస్య నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ తన నటనతో సినిమా స్థాయిని పెంచిందట.

బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. విజయ్ ‘మెర్సల్’ సినిమాను పక్కకు నెట్టి వసూళ్ల పరంగా ఈ సినిమా ముందుకు సాగుతుందట. ఒక్క చెన్నై సిటీలో మొదటి వీకెండ్ లో సినిమా కోటిన్నర వరకు వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను అనువదించి తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేయబోతున్నారు.