ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల ప్రకటన …!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందించిన జ్యూరీ కమిటీ సభ్యులు ఆ వివరాలను వెల్లడించారు.

కాగా కమిటీ ప్రతినిధులుగా నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు. వరుసగా 2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌, 2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌), 2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం, 2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌), 2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం), 2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనంగా ప్రకటించారు. ఇంకా 2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌), 2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు( శ్రీమంతుడు), 2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు, 2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, 2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు, 2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌, 2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, 2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌ కు ఎంపికైనట్లు ప్రకటించారు. అదే విధంగా ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డ్ 2014 కృష్ణంరాజు, 2015 ఈశ్వర్, 2016 చిరంజీవి ఎంపికైనట్లు కమిటీ ప్రకటించింది.