దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం..!

అండర్‌ వరల్డ్‌ డాన్‌, ముంబై జంట పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను మంగళవారం వేలం వేశారు. దక్షిణ ముంబైలో దావూద్‌కు చెందిన మూడు ఆస్తులకు వేలం ప్రక్రియ నిర్వహించారు. స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మానిప్యులేటర్స్‌ యాక్ట్‌ కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వేలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దావూద్‌కు చెందిన హోటల్‌ రునాక్‌ అఫ్రోజ్‌(ఢిల్లీ జైకా), షబ్నం గెస్ట్‌ గౌస్‌, దమర్‌వాలా బిల్డింగ్‌లోని ఆరు గదులను వేలం వేశారు.

కాగా సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ ఈ మూడింటి కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేసినట్లు వేలం ప్రక్రియను నిర్వహించిన అధికారి తెలిపారు. రునాక్‌ అఫ్రోజ్‌ హోటల్‌ రూ.4.53కోట్లు, షబ్నం గెస్ట్‌ హౌస్‌ రూ.3.52కోట్లు, దమర్‌వాలా బిల్డింగ్‌ గదులు రూ.3.53కోట్లు పలికినట్లు సమాచారం అందుతుంది.