ప్రతిపక్ష పాత్రలో అధికారపక్షం ఎమ్మెల్యేలు…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారపక్షం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు… పడవ ప్రమాదం వెనుక టూరిజం శాఖ నిర్లక్ష్యం ఉందంటూ నిన్న ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా మాట్లాడితే… ఇవాళ్ల జీరో అవర్ విషయంలో మంత్రులపై విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి… జీరో అవర్‌ను ఆషామాషీగా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే జీరో అవర్‌ను రద్దు చేయాలని కూడా కోరారు.

దీనికి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు పలికారు… మంత్రుల నుంచి సరైన సమాధానాలు రానప్పుడు జీరో అవర్ ఎందుకు అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏంటి? విష్ణుకుమార్ రాజు ఎలా స్పందించారు? వీరి కామెంట్లపై మంత్రులు ఎలా స్పందించారు… అసలు టీడీపీ నేతలే అధికారపక్షంపై ఎందుకు కామెంట్లు చేస్తున్నారో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…