ఐఫోన్‌ మూడు న్యూ మోడల్స్‌…!

యాపిల్‌ సంస్థ వచ్చే ఏడాది మరో మూడు కొత్త మొబైల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మధ్య విడుదలైన ఐఫోన్‌X మంచి ఫలితాలనే సాధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే తరహాలో 2018లో మరో మూడు కొత్త వెర్షన్‌ మొబైల్‌ ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి యాపిల్‌ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది చివరికల్లా చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ మూడు ఫోన్లు డిజైన్‌ పరంగా దాదాపు ఐఫోన్‌Xను పోలి వుండ వచ్చని ప్రముఖ మొబైల్‌ విశ్లేషక సంస్థ మింగ్‌ చికోవ్‌ తెలిపారు. కెమెరా సామర్థ్యం కూడా ఐఫోన్‌Xమాదిరే ఉంటుందని తెలుస్తుంది. ఈ మూడు ఫోన్లు వరుసగా 5.8 అంగుళాలు, 6.5 అంగుళాలు, 6.1 అంగుళాలు టచ్ స్క్రీన్ తో ఉండొచ్చని సమాచారం. ఇంకా వీటిలో 6.1, 6.5అంగుళాల టచ్ తో వచ్చే మొబైల్స్‌లో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండగా, 5.8 అంగుళాల మొబైల్‌లో టీఎఫ్‌టీ-ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండ వచ్చని భావిస్తున్నారు. కాగా 6.1 అంగుళాల మొబైల్‌ ఫోన్‌ ధర దాదాపు రూ.50,000 వరకు ఉండొచ్చని సంస్థ వర్గాలు వెల్లడిస్తాయి.