భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్‌..!

ఆర్థిక వ్యవహారాల నిపుణుడు కెన్నత్‌ జస్టర్‌ భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వాషింగ్టన్‌లో కెన్నత్ ప్రమాణ స్వీకారం చేశారు. పరస్పరం మేలు చేసేలా ఇరుదేశాల మధ్య శక్తిమంతమైన భాగస్వామ్యాన్ని జస్టర్‌ నెలకొల్పుతారని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెయిన్స్‌ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా రిచర్డ్‌వర్మ స్థానంలో కెన్నెత్‌జస్టర్‌ భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైనట్లయింది. డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పుడే రిచర్డ్‌ రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. నవంబరు 2న జస్టర్‌ నియామకాన్ని యూఎస్‌ సెనెట్‌ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది.