రాత్రికి రాత్రే విశ్వనగరంగా మారదు-కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేస్తున్నామన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు… అయితే రాత్రికి రాత్రే విశ్వనగరంగా మారదన్నారాయన… శాసమండలిలో కేటీఆర్ మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీపై భారం పడకుండా అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీని నుంచి పైసా తీసుకోకుండా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కడుతున్నామన్నారు కేటీఆర్… రోడ్లను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ విశ్వనగరంగా మారుస్తామన్నారాయన. నీటి ఎద్దడితో గతంలో వాటర్ బోర్డు ముందు ధర్నాలు జరిగేవి… కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు మంత్రి కేటీఆర్… నగరంలో నీటి ఎద్దడి తగ్గిపోయిందని… దీనికి కారణం అత్యధిక నిధులు మంజూరు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు కేటీఆర్.