మంటలు చెలరేగి దగ్ధమైన టూరిస్టు బస్సు…

విజయనగరం జిల్లాలో బస్సు ప్రమాదం తృటిలో తప్పింది… ఎస్.కోట మండలం కిలకంపాలెం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి… దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది… డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను ముందే దించివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చేలరేగిన సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులున్నారు. బస్సులో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. విజయలక్ష్మి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు విజయనగరం నుంచి అరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.