అమెరికా మాజీ అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు…

అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్‌పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేశారు… 14 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను రోస్లిన్ కార్రిగన్ అనే 30 ఏళ్ల మహిళ తాజాగా బయటపెట్టింది. తనకు 16 ఏళ్ల వయస్సులో తనకు మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూబుష్‌ను కలిసే అవకాశం వచ్చిందని… ఆ సమయంలో… బుష్‌ నన్ను ఎక్కడెక్కడో తన చేతితో తడుముతూ వేధింపులకు గురిచేశారని ఆరోపించింది కార్రిగన్…

ఆ ఘటన గురించి ఆమో చెబుతూ… 2003 ఏడాదిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు టెక్సాస్‌ వచ్చిన బుష్‌ను కలిసే అవకాశం వస్తే… తాను అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లి… అమెరికా 41వ అధ్యక్షుడు సీనియర్‌ బుష్‌ను కలిశానని… తనకు రాజకీయాలపై ఉన్న మమకారాన్ని ఆయనతో పంచుకున్నానని తెలిపారు కార్రిగన్… అయితే బుష్‌తో ఫొటో దిగే సమయంలో వెనుకవైపు నుంచి అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని… అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించకూడదని ఎలా చెప్పగలను అంటూ… ఆ ఘటనను బహిర్గతం చేశారామె. అయితే ఆమె ఆరోపణలపై స్పందించిన బుష్ అధికారిక ప్రతినిధి… బుష్ అలాంటి వ్యక్తి కాదని… ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించే మనస్థతం ఆయనది కాదని… వీల్‌చైర్‌లో ఉన్న ఆయన ఆసరాగా కొన్నిసార్లు పక్కనవారిని పట్టుకుని ఉంటారని… తప్పుగా అర్థం చేసుకోవద్దని వివరణ ఇచ్చారు. అయితే ఆ ఫొటోలో బుష్ వీల్‌చైర్‌లో కాకుండా… నిలబడి ఉన్నారు… గతంలోనూ బుష్‌పై లైంగిక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.