వైఎస్‌ జగన్‌పై మరోసారి మండిపడ్డ జేసీ…

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు టీడీపీ పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడి రాయలసీమకు నీరు ఇస్తుంటే… అనంతపురానికి నీరు ఇవ్వడం ఇష్టంలేకో… మరి కక్షతోనే గానీ… జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పల్నాడుకు నీరు ఇవ్వాలనే కొత్త వాదనను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ…

వైఎస్ జగన్ ఆలోచనంతా ముఖ్యమంత్రి కుర్చీ చుట్టే ఉందంటూ మండిపడ్డారు జేసీ దివాకర్ రెడ్డి… ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించాలని వైఎస్ జగన్ ప్రయత్నమని ఆయన ఆరోపించారు… ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి…