స్కూల్‌ సంప్ లో పడి బాలుడు మృతి..!

హైదరాబాద్ లోని మల్కాజిగిరి సమీపంలోని విష్ణుపురి కాలరిలో గల బచ్‌పన్‌ స్కూల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ స్కూల్ లో చదువుతున్న శివ రచిత్ అనే మూడేళ్ల చిన్నారి సంపులో పడి మృతి చెందాడు. బచ్‌పన్‌లో నర్సరీ చదువుతున్న శివ రచిత్‌ సంపులో పడి మృతి చెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.

కాగా ఆ స్కూల్ వద్ద నీటి సంపు మూత తెరిచి ఉండడంతో విద్యార్థి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందాడని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బాలల దినోత్సవం రోజే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.