టైగ‌ర్ ప‌వ‌ర్‌: ఫాస్టెస్ట్‌ 5 కోట్ల వ్యూస్‌..!

స‌ల్మాన్ భాయ్ `టైగ‌ర్ జిందా హై` ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. భాయ్ ట్రైల‌ర్ యూట్యూబ్‌, సామాజిక మాధ్య‌మాల్లో రికార్డ్ వ్యూస్‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ట్రైల‌ర్ రిలీజైన కేవ‌లం 24 గంట‌ల్లోనే రెండున్న‌ర కోట్ల వ్యూస్‌తో రికార్డులు తిర‌గరాసింది. రెండు రోజుల్లో 3 కోట్ల మంది `గోల్‌మాల్ ఎగైన్‌` ట్రైల‌ర్ వీక్షిస్తే, ఆ రికార్డును 24 గంట‌ల్లోనే స‌ల్మాన్ `టైగ‌ర్ జిందా హై` ట్రైల‌ర్ తుత్తునియ‌లు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ ట్రైల‌ర్ల‌లో భాయ్ దే అరుదైన రికార్డ్‌. ఇప్పుడు మ‌రో రేర్ ఫీట్‌ని టైగ‌ర్ జిందా హై ట్రైల‌ర్ అందుకుంది. ఇంత‌వ‌ర‌కూ అత్యంత వేగంగా ఐదు కోట్ల వ్యూస్ సాధించిన ఏకైక ట్రైల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. కండ‌ల హీరో స‌ల్మాన్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ … ఈ రికార్డులు ఎలివేట్ చేస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

స‌ల్మాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌క య‌శ్‌రాజ్ ఫిలింస్ నిర్మించిన `టైగ‌ర్ జిందా హై` క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 22న రిలీజ‌వుతోంది. ఇరాక్‌లో జ‌రిగిన ఓ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో స‌ల్మాన్ గూఢ‌చ‌ర్యం ఎలా ఉండ‌నుందో తెర‌పై చూపిస్తున్నారు. ఇంకో నెల‌రోజుల్లోనే సినిమా రిలీజ్‌కి రానుంది. భాయ్ రికార్డుల స్టామినా ఎంతో తేలిపోయే రోజు ఇంకెంతో దూరంలో లేదు. జ‌స్ట్ వెయిట్.