పిక్ టాక్‌: బులుగు జిలుగులో నీలిక‌నుల‌ ఐశ్వ‌ర్యం.!

2015లో ఏ దిల్ హై ముష్కిల్ చిత్రం రిలీజైంది. ఆ త‌ర్వాత ఐష్ న‌టించిన ఓ సినిమా కోసం మూడేళ్ల పాటు సుదీర్ఘంగా వేచి చూడాల్సొచ్చింది. అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త సంవ‌త్స‌రంలో ఐష్ సినిమాలు ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌నున్నాయి. ఫ్యానీఖాన్ చిత్రంతో పాటు ఐష్ మ‌రో రెండు క్రేజీ సినిమాల్లో న‌టించ‌నుంది. న‌ర్గీస్ ద‌త్ హిట్ మూవీ రీమేక్‌లోనూ న‌టించ‌నుంది. ఇంత పెద్ద లైన‌ప్‌తో వ‌స్తున్న ఐశ్వ‌ర్యారాయ్ మ‌రోసారి బ్యాక్ టు ఫామ్ గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇదిగో ఇటీవ‌లే దుబాయ్‌లో ఓ స్టోర్ ఓపెనింగుకి వెళ్లిన ఐష్ ఇలా బులుగు జిలుగు డ్రెస్సులో త‌ళుక్కుమంది. నీలిక‌ళ్ల సోయ‌గం బులుగు రంగు డిజైన‌ర్ వేర్‌.. ఈ కాంబినేష‌న్ హైలైట్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. 44 వ‌య‌సులోనూ ఐసూలోని స్పీడు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఇదిగో ఈ లుక్ చెబుతోంది. ఇక ఇటీవ‌లి కాలంలో షూటింగులు, బ్రాండ్ ప్ర‌మోష‌న్ల కోసం ఐష్ త‌న కుమార్తె ఆరాధ్య లేకుండానే వెళుతుండ‌డం హాట్ టాపిక్ అయ్యింది.