పోలవరం త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం…

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… అనంతరం నేరుగా పుణె చేరుకున్నారు. పుణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు త్రీడీ డిజైన్స్‌ను పరిశీలించారు ఏపీ సీఎం. దాదాపు ఎకరం నుంచి ఎకరంన్నర స్థలంలో పోలవరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు పుణెలోని రీసెర్చ్ స్టేషన్‌లోని ఇంజినీర్లు. నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది… స్పిల్‌ వే, స్పిల్ చానెల్, డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి చూపించారు అక్కడి ఇంజినీర్లు… చంద్రబాబు వెంట పుణె వెళ్లిన బృందంలో మంత్రి దేవినేని ఉమ, ఇరిగేషన్ శాఖ అధికారులున్నారు.